![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -390 లో.. కృష్ణ, ముకుంద, మురారి, ఆదర్శ్ అందరు కలిసి గుడి నుండి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ అందరు తింటుంటారు కానీ ఆదర్శ్ చేతికి గాయం కావడంతో తినలేక ఇబ్బంది పడతాడు. దాంతో నువ్వు తినిపించు ముకుంద అని కృష్ణ చెప్తుంది. ముకుందకి ఇష్టం లేకున్నా ఆదర్శ్ స్థానంలో మురారిని ఉహించుకొని తినిపిస్తుంది. ఆ తర్వాత ముకుంద తింటుంటే ఇద్దరు ఒకే ప్లేట్ లో తినండి అని కృష్ణ అనగానే ఎందుకులే కృష్ణ అని ఆదర్శ్ అంటాడు.
ఆ తర్వాత కృష్ణ బట్టలు సర్దుతు ఉంటుంది. అప్పుడే కృష్ణ నాన్న ఫొటోకి వేసిన దండ వాడిపోయి కిందపడిపోతుంది. అది చూసి ప్రొద్దున్నే వేసాను కదా ఎందుకు ఇలా అవుతుందని కృష్ణ భయపడుతుంది. అప్పుడే మురారి వస్తాడు. తనకి ఆ విషయం చెప్పి కృష్ణ భయపడుతుంటే.. ఎందుకు అలా ప్రతి దానికీ అనవసరంగా టెన్షన్ పడుతావని మురారి అంటాడు. అన్నిటికి లింక్ చేసి ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకని కృష్ణకి మురారి చెప్పి డైవర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ముకుంద ఒంటరిగా కూర్చొని ఆదర్శ్ స్థానంలో మురారిని ఉహించుకొని తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నానని మనసులో అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ వచ్చి వేరొకరిని ప్రేమించి, వాళ్లని మర్చిపోయి త్వరగా నీ మనసులో నాకు చోటు ఇచ్చావ్. నువ్వు నా పైన చూపించే ప్రేమ చూస్తుంటే నిన్ను వదిలేసి వెళ్లి నిజంగా తప్పు చేసాను. సారీ ముకుంద అని ఆదర్శ్ చెప్తాడు. ఎన్ని సార్లు సారీ చెప్తావని ముకుంద అంటుంది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అని ఆదర్శ్ అంటాడు.
ఆ తర్వాత మధు దగ్గరికి ఆదర్శ్, మురారి వస్తారు. ముగ్గురు కలిసి ఫుల్ గా డ్రింక్ చేస్తారు. మరొక వైపు వీళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర అందరు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు తాగి ఊగుతు వస్తుంటే.. అందరికి వాళ్ళు డ్రింక్ చేశారని అర్ధం అవుతుంది. ఈ ఆదర్శ్ తాగి ఏం వాగాడో ఏంటో? ఈ టెన్షన్ ఒకటి అని ముకుంద మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మురారిని డ్రింక్ చేశారు కదా ఊదండి అని కృష్ణ అంటుంది. మురారి మాత్రం ఫన్నీగా బిహేవ్ చేస్తుంటాడు. తరువాయి భాగంలో కృష్ణ అందరికి కాఫీ ఇస్తుంటుంది.. కృష్ణ నీ రింగ్ వేలికి లేదేంటని నందు అడుగుతుంది. అవునని కృష్ణ టెన్షన్ పడుతుంది. నేను మురారికి ఇచ్చిన రింగ్ ని, కృష్ణకి పెట్టాడు. ఇప్పుడు ఆ రింగ్ పోవడమేంటి? అంటే నా ప్రేమపై మళ్ళీ నేను ఆశలు పెంచుకోవచ్చా? అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |